
ఢిల్లీ లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుబి మోగించింది. బుధవారం ప్రకటించిన ఫలితాలలో ఐదింటిలో నాలుగు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మరో స్థానం కాంగ్రెస్ వశం అయ్యింది.
గతంలో ఇక్కడ ఒక స్థానంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఉప ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దేశ రాజధానిలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో యాభై శాతం పై చిలుకు ఓటింగ్ నమోదైంది.
ఈ విజయంతో ఆమ్ ఆద్మీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. “దిల్లీ ప్రజలు పనిని చూసి ఓటు వేశారు. అందరికీ శుభానందనలు.
ఎంసీడీలో 15 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. వారు ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్నారు” అంటూ ట్విటర్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
दिल्ली के लोगों ने एक बार फिर से काम के नाम पर वोट दिया। सबको बधाई।
MCD में 15 साल के भाजपा के कुशासन से जनता परेशान हो चुकी है। लोग अब MCD में भी आम आदमी पार्टी की सरकार बनाने के लिए बेताब हैं। https://t.co/aIKthb13q2
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 3, 2021