
దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఆయన తొలి డోసు టీకా వేసుకున్నారు.
మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ వయసు 62 ఏళ్లు. 1983లో వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించారు.
60 ఏళ్ల వయసు దాటిన వారికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది. దేశంలోని వృద్ధులంతా కోవిడ్ టీకా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ పిలుపునిచ్చారు.
ఇప్పటికే టీమిండియా కోచ్ రవిశాస్త్రి గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో సోమవారం కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు.
ఇవాళ పలు రాష్ట్రాల్లో మంత్రులు కోవిడ్ టీకా తీసుకున్నారు. కేరళకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా, రెవన్యూ మంత్రి చంద్రశేఖరన్‌లు ఈ రోజు కరోనా టీకాలు తీసుకున్నారు.