షియోమి సరికొత్త మానిటర్

298

ఎల‌క్రానిక్స్ రంగంలో ఏదో ఒక కొత్త ప‌రిక‌రం మార్కెట్లోకి విడుద‌ల‌వుతూనే ఉంటుంది. మ‌రింత ఉత్త‌మ ఉత్ప‌త్తుల‌ను కంపెనీలు అందిస్తూనే ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ సరికొత్త మానిటర్​ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

27-అంగుళాల ఫుల్​ హెచ్​డీ కంప్యూటర్​ మానిటర్​ను లాంఛ్ చేసింది.

రెడ్‌మి డిస్​ప్లే 1ఎ తర్వాత షియోమి సబ్ బ్రాండ్ నుంచి వస్తోన్న రెండో మానిటర్ ఇదే.

ఇది ఫుల్​ హెచ్‌డి రిజల్యూషన్, మూడు వైపులా స్లిమ్ బెజెల్​తో అట్రాక్టివ్​ లుక్‌ కలిగి ఉంటుంది.

అయితే బ్లాక్ కలర్​ ఆప్షన్​లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

ఇది మెరుగైన ఫామ్​ ఫ్యాక్టర్​ను కలిగి ఉంటుంది. మెరుగైన పిక్చర్​ క్వాలిటీ కోసం దీనిలో ఐపిఎస్ ప్యానెల్​ను కూడా చేర్చింది.

దీనిలోని RGB కలర్ స్పేస్100 శాతం కవరేజీని అందిస్తుందని రెడ్​మి పేర్కొంది.

ఇక దీని ధర విషయానికి వస్తే CNY 799 (భారత కరెన్సీలో సుమారు రూ .9,100)కే విక్రయించనుంది.

ప్రస్తుతం దీన్ని చైనా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న‌ట్టు తెలిపింది. వారు జెడి.కామ్, షియోమి యోపిన్​ ప్లాట్​ఫాం​లపై మానిటర్​ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

బుకింగ్​ చేసుకున్న కస్టమర్లకు మార్చి 9 నుండి మానిటర్ డెలివరీలు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్​లో దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారనే విషయంపై మాత్రం రెడ్​మీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

రెడ్‌మి 27- అంగుళాల కొత్త మానిటర్‌లో ఫుల్​ -హెచ్‌డి (1,920×1,080 పిక్సెల్స్) ఐపిఎస్ ప్యానెల్​ను అందించింది. ఇది పైభాగంలో అన్ని వైపులా స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది.

178- డిగ్రీల కోణాలతో, 100 శాతం RGB కలర్ స్పేస్​ను చేర్చింది. అంతేకాక, ఇది టియువి రీన్‌ల్యాండ్‌లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది.

ఈ మానిటర్ 75Hz గరిష్ట రిఫ్రెష్ రేట్, 16: 9 ఆస్పెక్ట్​ రేషియో, 6ms GTG రెస్పాన్స్​ టైం, 10,00,000: 1 కాంట్రాస్ట్ రేషియోతో అందుబాటులో ఉంటుంది.

ఇక దీనిలో 300 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందించింది. మానిటర్​ కనెక్టివిటీ కోసం, HDMI 1.4 పోర్ట్, VGA పోర్ట్, వెనుక భాగంలో హెడ్‌ఫోన్ జాక్​లను చేర్చింది.

మానిటర్​ను నిలబట్టే Y ఆకారపు స్టాండ్​ను సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 4.3 కిలోల బరువు గల 27-అంగుళాల రెడ్‌మి మానిటర్ 613.2×205.3x476mm డైమెన్షన్​ను కలిగి ఉంటుంది.

అంతేకాకుండా ఇది​ కేవలం 7.5 మి.మీ. మందం గల ప్యానెల్​​తో వస్తుంది. మానిటర్​తో పాటు ఎక్స్​టర్నల్​ పవర్ అడాప్టర్‌ను కూడా రెడ్​మీ అందిస్తోంది.