రాసలీల వీడియో లీక్ .. బీజేపీ మంత్రి రాజీనామా!

224
Minister Ramesh

ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను లోబరుచుకొని కర్ణాటక బీజేపీ మంత్రి రాసలీల వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

కొలువు పేరుతో నమ్మించి జల వనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోళి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఓ మహిళ ఆరోపించారు.

దీంతో అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన మంతరి పదవికి రమేశ్ జార్కిహోళి రాజీనామా చేశారు.

ఉద్యోగం ఆశచూపి మంత్రి తనను లైంగికంగా వాడుకున్నారని ఆ మహిళ తగిన వీడియో ఆధారాలను వెల్లడించడంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది.

అయితే తన చిత్రాలను మార్ఫింగ్ చేసి ఈ వీడియో రూపొందించారని నిన్న మంత్రి వ్యాఖ్యానించారు. అయినాప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకున్నారు.

ఈ మేరకు సీఎం యడియూరప్పకు రాజీనామా లేఖను పంపించారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నట్టు రమేశ్ వివరణ ఇచ్చారు.