తాను హనుమంతుడి భక్తుడను: కేజ్రీవాల్‌

270
He is a devotee of Hanuman: Kejriwal

తాను హనుమంతుడి భక్తుడినని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన  అసెంబ్లీలోమాట్లాడారు.

హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడని, దీంతో తాను వారిద్దరి భక్తుడినని తెలిపారు.

అయోధ్య రాజైన రాముడి పాలనలో ప్రజలకు అంతా మంచి జరిగిందని తెలిపారు.

రాముడి పాలనలో వారికి ఎలాంటి బాధలు లేవని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని అందుకే రామరాజ్యంగా రామాయణంలో పేర్కొన్నారని కేజ్రీవాల్‌ తెలిపారు.

అలాంటి రామరాజ్యం నుంచి స్ఫూర్తి పొందిన పది సూత్రాలను తమ పాలనలో అమలు చేస్తున్నామని చెప్పారు.

బాలలకు మంచి చదువు, అందరికీ మెరుగైన చికిత్స, 24 గంటల విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామన్నారు.

పేదల కోసం గృహాల నిర్మాణం, మహిళలకు భ్రదత, వృద్ధులను గౌరవించడం, అందరికీ సమాన అధికారాలు వంటివి తమ ప్రభుత్వం పాటిస్తున్నదని కేజ్రీవాల్‌ తెలిపారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు యాత్రల ద్వారా వృద్ధులకు శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని ఆప్‌ ప్రభుత్వం కల్పిస్తుందని కేజ్రీవాల్‌ చెప్పారు.