ప్రేమ అప్యాయతలకు ప్రతి రూపం స్త్రీ. కానీ గత కొన్నేళ్లుగా వారికి ఏమైందో తెలీదు.
భర్తను చంపి ఆ స్థానంలో ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించేందుకు ప్రయత్నించింది ఆ మధ్య ఓ మహిళ.
ఇలా మహిళలు ఎందుకు హంతకులు అవుతున్నారో తెలీదు. అయితే తాజాగా హైదరాబాద్ వనస్ధలిపురంలో ఉండే మహిళ తన భర్తను చంపింది.
తానే మిస్సింగ్ కేసు పెట్టింది. తీరా చూస్తే ఆమె తన ఇంట్లోనే భర్త శవాన్ని పూడ్చి పెట్టింది.
ఈ ఘటన విషయానికొస్తే.. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆ కోపంతో ఆమె భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.
గగన్ అగర్వాల్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.
గతేడాది జూన్‌లో పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగం( మరియద) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి గగన్ కనిపించకుండా పోయాడు. దీంతో భర్త కనవిపించటంలేదని నౌసీన్, గగన్ సోదరుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా భార్య నౌసిన్ బేగంను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
పెళ్లైన కొద్ది రోజుల నుంచే గగన్‌కు అతని రెండో భార్య నౌసీన్‌కు మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరికీ రోజు గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ గొడవలతో విసుగు చెందిన నౌసిన్ భర్తను హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టింది. అనంతరం ఆమె ఎల్బీనగర్ పోలీసులకు పిర్యాదు చేసి పాతబస్తీకి వెళ్లిపోయింది.
అగర్వాల్ కనపడటక పోవటంతో అతని తమ్ముడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ కేసు ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని వనస్ధలిపురం పోలీసులు అక్కడకు బదిలీ చేశారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నౌసీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆమె పొంతన లేని సమాధానులు చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం ఒప్పుకుంది.
రోజు గొడవ పడుతున్న భర్తను తానే హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు ఆమె అంగీకరించింది.