రెండో పెండ్లి కోసం కరెంట్ పోలెక్కిన వృద్ధుడు

344
old man Climb Electric Pole second marriage

రెండో పెండ్లికి కుటుంబం అడ్డు చెప్పడంతో ఓ వృద్ధుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

విద్యుత్‌ స్తంభం ఎక్కి తీగలు పట్టుకున్నాడు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో జరిగింది. సోబ్రాన్ సింగ్ అనే 60 ఏండ్ల వ్యక్తి భార్య నాలుగేండ్ల కిందట చనిపోయింది.

సంతానమైన ముగ్గురు మగ, ఇద్దరు ఆడ పిల్లలకు పెండ్లిండ్లు అయ్యాయి.

అయితే ఇటీవల రెండో పెండ్లి చేసుకుంటానని సోబ్రాన్‌ సింగ్‌ తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆ వృద్ధుడు మరోసారి తన పిల్లల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా వారు మండిపడ్డారు.

దీంతో సోబ్రాన్ సింగ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి పొలంలోని ఒక విద్యుత్‌ స్తంభం ఎక్కాడు.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేదు.

కుటుంబ సభ్యులు వెంటనే విద్యుత్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం స్థానికులు కలిసి నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆ వృద్ధుడు విద్యుత్‌ స్తంభం నుంచి కిందకు దిగాడు.