ఎన్నికల సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. జరిగే ఘటనలు పొరపాటున జరుగుతాయో ఎవరైనా కావాలనే చేస్తారో కూడా చెప్పలేం.
అటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్‌కు వెళ్లారు.
సాయంత్రం ప్రచారం ముగించుకొని కారు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో తోపులాట జరిగింది.
దీంతో ఆమె కాలికి గాయమైంది. నొప్పితో మమత విలవిలలాడారు. తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ తెలిపారు.
నలుగురు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి నందిగ్రామ్‌లోనే బస చేయాల్సి ఉండింది.
కాలి గాయం కారణంగా నందిగ్రామ్ పర్యటన రద్దు చేసుకొని మమత కోల్‌కతా వెళ్లిపోయారు.
మమతపై దాడి అంశాన్ని ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేయనుంది.
నందిగ్రామ్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా మమతాబెనర్జీ ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు.
294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.