50 ఏళ్ల వెరైటీ దొంగలు

260

పేద‌రికం వ‌ల్ల‌ దొంగ‌త‌నాలు చేసే వారిని చూశాం. జ‌ల్సాల కోసం దొంగ‌త‌నాలు చేసేవారిని చూశాం.

కానీ దొంగ‌త‌నం చేసి కామకోరికలు తీర్చుకోవడం చూశారా? కనీసం విన్నారా? లేదు క‌దా.

ఇదిగో వీళ్లే ఆ వెరైటీ దొంగ‌లు. ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తుల‌ను చూశారా? వీళ్లు కామకోరికలు తీర్చుకునేందుకే దొంగతనాలు చేస్తున్నారు.

ఒక రోజుకు రూ.15 వేలు తీసుకునే యువతులతో గడిపేందుకు ఆ దొంగ‌త‌నం చేసిన డ‌బ్బున వెచ్చిస్తుంటారట‌.

ఇది తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు వెరైటీ దొంగలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి ఇద్దరి వయసూ 50 ఏళ్ల పైనే. ఈ వయసులోనూ యువతులతో గడిపేందుకు తహతహలాడుతున్నారు.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ చింతలబస్తీకి చెందిన మేళ్లచెరువు రామారావు (52)పై 61 చోరీ కేసులు, రాజమండ్రికి చెందిన కోసూరి శ్రీనివాసరావు (54)పై 27 చోరీ కేసులున్నాయి.

మేడిపల్లి పరిధిలోని బుద్ధనగర్‌లో తరచూ చోరీలు జ‌రుగుతుండ‌టంతో పోలీసులు నిఘా పెట్టారు.

స్థానిక సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఈ ఇద్దర్నీ గుర్తించారు. వీరికంటూ ప్రత్యేకంగా ఇల్లు లేదు. లాడ్జీల్లో ఉంటారు.

దీంతో వీళ్ల‌ను పట్టుకోవడం పోలీసుల‌కు కత్తిమీద సాములా మారింది.

సోమవారం (మార్చి 8,2021) అర్ధరాత్రి చోరీ సొత్తుతో దర్జాగా వెళ్తుండగా మేడిపల్లి పోలీసులు అడ్డుకున్నారు.

టీచర్లమంటూ బోల్తా కొట్టించేందుకు యత్నించినా తప్పించుకోలేకపోయారు.

గ‌తంలో రామారావు ఆటో డ్రైవర్‌గా, శ్రీనివాసరావు ప్రైవేటు టీచరుగా పనిచేశారు.

వేర్వేరు ఘటనల్లో బోయిన్‌పల్లి పోలీసులకు దొరికారు. జైల్లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత బయటకు వచ్చాక టీచర్లమంటూ ఐడీ కార్డులు చూపించి ముత్తూట్‌, మణప్పురం గోల్డ్‌ తదితర సంస్థల నుంచి లోన్లు తీసుకున్నారు.

అలా వచ్చిన డబ్బులో 30 శాతం కామవాంఛ తీర్చుకునేందుకు ఖ‌ర్చు చేశారు.

మిగిలిన 60 శాతం పాత నేరస్తులను విడిపించేందుకు వినియోగించారు.

బ్రహ్మదేవర రాజశ్రీ గణేష్‌ అలియాస్‌ విజయ్‌ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు.

అతనిపై పీడీ చట్టం తీసేసేందుకు గాను అతని భార్య సరితకు రూ.1.5 లక్షల చోరీ సొత్తును ఇచ్చారు.

మేళ్లచెరువు రామారావు (52), కోసూరి శ్రీనివాస్‌రావు(54) పాత నేరస్తులు. తెలుగు రాష్ట్రాల్లో 88 చోరీలు చేశారు.

వీరికి చర్లపల్లి జైల్లో పీడీ యాక్ట్ కింద‌ శిక్ష అనుభవిస్తున్న గణేశ్‌ పరిచయయ్యాడు.

పీడీ యాక్టు తొలగించేందుకు పీర్జాదిగూడలో ఉండే తన భార్య సరిత (27)కు డబ్బులు ఇవ్వాల్సిందిగా గణేశ్‌ వారిని కోరాడు.

జనవరిలో విడుదలైన రామారావు, శ్రీనివాస్‌రావు సికింద్రాబాద్‌లో లాడ్జిలో ఉంటూ చోరీలు చేస్తున్నారు. చోరీ సొత్తును సరితకు ఇస్తున్నారు.