“గంగూబాయి కతియావాడి” టీజర్… అలియా నటనకు సెలెబ్రిటీలు సైతం ఫిదా

293
Gangubai Kathiawadi Teaser Out

అలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్న సినిమా “గంగూబాయి కతియావాడి”.

ముంబైలోని కామటిపురా (రెడ్ లైట్ ఏరియా) ప్రాంతంలో గంగుబాయి అనే వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’లోని ‘మేడమ్ ఆఫ్ కామటిపుర’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

ముంబైలోని కామటిపురా (రెడ్ లైట్ ఏరియా) ప్రాంతంలో నివసించే ఓ వేశ్య అందర్నీ శాసించే నాయకురాలిగా ఎలా మారిందనేది సినిమా ప్రధానాంశం.

అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ లో గంగుబాయిగా అలియా నటన ఆకట్టుకుంటోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

ప్రముఖులు సైతం “గంగూబాయి కతియావాడి” టీజర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. షారూక్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, ప్రియాంకా చోప్రా, ర‌ణ్‌వీర్ సింగ్‌, క‌ర‌ణ్ జోహార్ లాంటి వారంతా గంగూభాయ్ టీజ‌ర్‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్లు చేశారు.

గంగూభాయ్ స్పెష‌ల్‌గా ఉందంటూ, సినిమా అద్భుత విజ‌యం సాధించాలంటూ షారూక్ త‌న ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

గ‌తంలో సంజ‌య్ లీలా భ‌న్సాలీతో క‌లిసి ప‌నిచేసిన ప్రియాంకా చోప్రా కూడా ఆలియా న‌టిపై ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. సంక్లిష్ట‌మైన పాత్ర‌ను ధైర్యంగా చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉందంటూ ఆలియాను మెచ్చుకున్న‌ది.

భ‌న్సాలీకి, ఆయ‌న టీమ్‌కు కూడా ప్రియాంకా కంగ్రాట్స్ చెప్పింది. అక్ష‌య్‌కుమార్ కూడా ట్వీట్ చేస్తూ.. ఆ ఫిల్మ్ టైటిలే చాలా ఆస‌క్తిక‌రంగా ఉందంటూ పేర్కొన్నాడు.

టీజ‌ర్ బ్రిలియంట్‌గా ఉదంటూ క‌ర‌ణ్ జోహార్ ట్వీట్ చేశాడు. గంగూ తో చాంద్ హై, చాంద్ ర‌హేగా అంటూ ర‌ణ్‌వీర్ ట్వీట్ చేశాడు.