
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని 26వ చిత్రమైన “టక్ జగదీష్”కు తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ‘టక్ జగదీష్’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ పూర్తిగా మాటలతో కాకుండా థీమ్ పాటతో సాగింది. నాని, రీతు లవ్ ట్రాక్ తో పాటుగా, ఫైటింగ్ సీన్స్ కూడా చూపించారు.
కాగా నాని ప్రతి స్కీన్ లోను ‘టక్’ వేసుకుని కన్పించారు. టీజర్ లో పండగ వాతావరణం కన్పించింది.
“పండగకి వచ్చే సినిమాలు కొన్ని… పండగలాంటి సినిమాలు కొన్ని” అంటూ నాని టీజర్ వీడియోను ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన “ఇంకోసారి” అనే లిరికల్ వీడియో సాంగ్ కు మంచి ఆదరణ దక్కింది. ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.