ఈ ఆటోల‌కు డీజిల్ అక్క‌ర్లేదు గురూ!

427

ఇంధ‌నం ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్విచ‌క్ర వాహ‌న‌దారులు బెంబేలెత్తిపోతున్నారు. ర‌వాణా వాహ‌నదారుల ప‌రిస్థితి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

బాడుగ ఎక్కువ చెబితే ఎక్కేవాళ్లు త‌క్కువ‌. అలాగ‌ని త‌క్కువ బాడుగ‌కు తీసుకెళ్తే మిగిలేది త‌క్కువ‌.

ఇటువంటి ప‌రిస్థితుల్లో పెట్రోల్ లేదా డీజిల్ విన‌యోగం లేని ఆటోల‌ను పియాజియో కంపెనీ మార్కెట్లోకి ప్ర‌వేశ పెట్టింది. కొత్త‌గా ఆటో కొనాల‌నుకునే వారికి ఇది అదిరిపోయే ఆఫ‌ర్‌.

దిగ్గజ త్రివీలర్ తయారీ కంపెనీ పియాజియో తాజాగా సరికొత్త ఆటోలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇవి ఎలక్ట్రిక్ ఆటోలు. అంటే వీటికి డీజిల్ కొట్టించాల్సిన పని లేదు.

కంపెనీ వీటిని ఎఫ్ఎక్స్ శ్రేణి కింద మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఎఫ్ఎక్స్ అంటే ఫిక్స్‌డ్ బ్యాటరీ అని అర్థం. ఈ ఆటోలు ప్యాసింజర్, కార్గో ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్త పియాజియో ఏప్ ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్‌లో 9.5 కిలోవాట్ పవర్‌ట్రైన్ ఉంటుంది. పూర్తిగా మెటల్ బాడీ వీటి ప్రత్యేకత. కార్గో విభాగంలో ఆటోకు ఆరు అడుగుల బాడీ వస్తుంది.

వీటిల్లో బ్లూవిజన్ హెడ్ ల్యాంప్స్, న్యూ బాడీ గ్రాఫిక్స్, కొత్త కలర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయెల్ టోన్ సీట్స్ ఇలా పలు రకాల ఫీచర్లు ఈ ఆటోలలో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బూస్ట్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని వివరించింది.

అంతేకాకుండా ఈ కొత్త ఆటోలు కొనుగోలు చేసిన వారికి మరిన్ని బెనిఫిట్స్ లభించనున్నాయి.

వీటిపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. లేదంటే లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. ఇంకా మూడేళ్ల ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా లభిస్తుంది.

పియాజియో ఐకనెక్ట్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా రియల్‌టైమ్ వెహికల్ డేటా ట్రాకింగ్ సహా ఇతర బెనిఫిట్ పొందొచ్చు.

ఇకపోతే పియాజియో ఏప్ ఎలక్ట్రిక్ ఎఫ్ఎక్స్ వెహికల్స్ ధరలు చూస్తే..

ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్ అనే కార్గో వెర్షన్ ధర రూ.3.12 లక్షలుగా ఉంది.
అదే ఈసిటీ ఎఫ్ఎక్స్ అనే ప్యాసింజర్ వెహికల్ ధర రూ.2.83 లక్షలుగా ఉంది.

ఈ కొత్త ఆటోలు కొనుగోలు చేయాలని భావించే వారు ఈజీగా 1800 120 7520 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు.

పియాజియో వెహికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డియాగో గ్రాఫీ మాట్లాడుతూ.. ఇండియన్ ఎలక్ట్రిక్ రెవల్యూషన్‌లో భాగంగానే ఎఫ్ఎక్స్ శ్రేణి వెహికల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చామని తెలిపారు.