‘విజేత’ ట్రైలర్ విడుదల

777
vijetha-telugu-movie-trailer-released

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ ‘విజేత’. ఈ మూవీ ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ చిత్రం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథాంశంతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా విజేతలో ఉంటుంద‌ని స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌలి, ఎంఎం కిరవాణీ ముఖ్యఅతిథులుగా ఆడియో వేడుకకు హాజ‌రయ్యారు. 

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ నిర్మిస్తుండగా “బాహుబలి”కి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. రాకేశ్ శ‌శి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ కథనాయికగా నటిస్తోంది. ప్రముఖ కళా దర్శకుడు రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముర‌ళీ శ‌ర్మ హీరో తండ్రి పాత్ర‌లో నటిస్తుండగా తనికెళ్ళభరణి, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూలైలో మూవీ విడుదల కానుంది.