
అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఫన్నే ఖాన్. ఈ నటి తాజాగా ‘ఫన్నేఖాన్’ మూవీతో అభిమానులను పలకరించేందుకు వస్తోంది.ఇదో లవ్లీ మ్యూజికల్ మూవీ. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫన్నేఖాన్ ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, అనిల్‌కపూర్, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ పాప్ సింగర్ పాత్రలో కనిపించనుంది.అనిల్ కపూర్ మ్యూజిషియన్ పాత్రలో కనిపించబోతున్నాడట. సినిమాలో చాలా పాటలుండబోతున్నాయి. అమిత్ ద్వివేది సంగీత దర్శకుడు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకురానుంది.
Jo khud apni kahani likhe woh hi hai #FanneyKhan…#FanneyKhanTeaser #AishwaryaRai @RajkummarRao @divyadutta25 @TSeries @fanneykhanfilm @ROMPPictures @AtulManjrekar #VirenderArora #NishantPittihttps://t.co/BFMwtvG39e
— Anil Kapoor (@AnilKapoor) June 26, 2018