‘సూధు కవ్వుమ్’, ‘ఓహ్ మై కడావులే’ వంటి తమిళ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్. ఈ టాలెంటెడ్ నటుడు ‘నిన్నిలా నిన్నిలా’ అనే చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. రీతూ వర్మ, నిత్యా మీనన్ లు ఈ “నిన్నిలా నిన్నిలా” చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ చిత్రం “నిన్నిలా నిన్నిలా” ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు చిత్రబృందం. 3 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లండన్ లోని ఒక రెస్టారెంట్ లో అశోక్ సెల్వన్ (దేవ్) చెఫ్ గా ఉంటాడు. అయితే అతనికి కండరాల నొప్పికి సంబంధించిన విచిత్రమైన జబ్బు ఉంటుంది.
నాజర్ రెస్టారెంట్ హెడ్ చెఫ్ గా కనిపిస్తుండగా, రీతూ వర్మ కో-చెఫ్ తారా అనే పాత్ర పోషిస్తోంది. ఇక నిత్యామీనన్ చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న మాయ అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఎమోషన్స్ తో పాటు సరదాగా సాగిపోయిన “నిన్నిలా నిన్నిలా” ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
దేవ్, తారా మధ్య ప్రేమ ఎలా చిగురించింది ? వారి మధ్య అపార్థాలు రావడానికి కారణం ఏంటి ? వీరిద్దరి మధ్య నిత్యామీనన్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 26 న విడుదల కానుంది.