రామగుండం మున్సిపాలిటీ లో స్వచ్ఛ సర్వేక్షన్

404
Swachh Survekshan in Ramagundam Municipality

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం జరిగింది. రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఈరోజు స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు మరియు చెత్తను సేకరించి చెత్త బండిలో వేయడం జరిగింది, ప్రజలందరూ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి, అదేవిధంగా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చూడాలని, డ్రైనేజీ లో కూడా చెత్తను వేయవద్దని అందరూ కూడా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కి సహకరించి చెత్త సేకరించే బండి లోనే చెత్తను వేయాలని పలువురు కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు.

12 వ డివిజన్ లో

12వ డివిజన్ లో కార్పొరేటర్ బోడ్డు రజిత ఆధ్వర్యంలో ప్లాగింగ్ ( రోడ్ కు ఇరువైపులా లేదా ఖాళీ ప్లేస్ లలో ఉన్న ప్లాస్టిక్ కవర్లు తీసివేసే కార్యక్రమం) చేయడం జరిగింది,

ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడ్డు రజిత మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తద్వారా డివిజన్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూనే , మన 12 డివిజన్ ను చెత్త రహిత డివిజన్ గా మార్చాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

Boddu Rajitha

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణ దాసు మారుతి, అరెళ్లి కిష్టస్వామి ,సందవేన కుమార్ , తోరికొండ శ్రీనివాస్, అనవేన మహేందర్, ప్రవీణ్ రెడ్డి, ఉష్కామల్ల వంశీ, రౌతు అంజయ్య, సంపత్ రెడ్డి, అనవేనసంధ్య , సునీతా, కవిత, శానిటేషన్ సూపర్వైజర్ సారయ్య మరియు మున్సిపల్ సిబ్బంది మూర్తి తదితరులు పాల్గొన్నారు.

43 వ డివిజన్ లో

స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ పరిధి 43వ డివిజన్ లో కార్పొరేటర్ ధరణి స్వరూప ఆధ్వర్యంలో ప్లాగింగ్ (ప్లాస్టిక్ కవర్లు ఏరు కార్యక్రమం) కార్యక్రమం నిర్వహించారు.

డివిజన్ పరిధిలోప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడటం పూర్తిగా మానివేయాలని, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ అటోలో తడి పొడి చెత్తగా వేరు చేసి వేయాలని కార్పొరేటర్ ధరణి స్వరూప కోరారు. రామగుండం నగర పాలక సంస్థ ను మొదటి స్థానం లో ఉంచగలరని తెలిపారు.

Dharani Swarupa

ఈ కార్యక్రమంలో లో43 వ డివిజన్ కార్పొరేటర్ ధరణి స్వరూప జలపతి సూపర్వైజర్ అశోక్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

45 వ డివిజన్ లో

45 వ డివిజన్ లో స్వచ్ సర్వేక్షన్ లో భాగంగా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు ఆధ్వర్యంలో ఈ రోజు ప్లాగింగ్ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంఘాల వారు మరియు డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరు స్వచ్ సర్వేక్షన్ 2021 ప్లాగింగ్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Kommu Venu

అలాగే స్వచ్ సర్వేక్షన్ 2021 లో రామగుండం నగర పాలక సంస్థ ను మొదటి స్థానం లో ఉంచాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు, మున్సిపల్ సిబ్బంది మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.