దళారీ వ్యవస్ధను క్రమక్రమంగా తగ్గించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

142
Niranjan reddy

మార్కెట్‌ లో దళారీ వ్యవస్ధను క్రమక్రమంగా తగ్గించాలని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాబార్డ్‌ సహకారంతో గ్రామీణ మార్కెట్‌ వాహనాన్ని హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమించి పంటలను పండించే రైతులకు గిట్టుబాటు ధర దక్కాలన్నారు.

సాంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలన్నారు. కూరగాయలు,పండ్ల తోటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రైతుఉత్పత్తిసంఘాలు, రైతుసహకార సంఘాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని తెలిపారు.

రైతు బజార్లలో పండ్లు, కూరగాయల రైతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రైతు నుంచి ఉత్పత్తులను నేరుగా వినియోగ దారులకు చేరినప్పుడే ఇద్దరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. వినియోగ దారులకు న్యాయమైన ధరకు కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు.