“ఆర్ఆర్ఆర్” క్లైమాక్స్ కోసం చరణ్, ఎన్టీఆర్ రిహార్సల్స్… పిక్ వైరల్

191
Jr NTR and Ram Charan unwind while practicing for the climax of RRR

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’ (రౌద్రం ర‌ణం రుధిరం)’.

తాజాగా ఈ చిత్ర లొకేషన్‌లో రామరాజు, భీమ్‌ కలిసి కబుర్లు చెప్పుకుంటున్న పిక్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. “ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన శక్తివంతమైన క్లైమాక్స్‌ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి” అంటూ చిత్రయూనిట్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

“ఆర్ఆర్ఆర్” చిత్రంలో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి విడుదల కానుంది. ద‌స‌రా కానుకగా అక్టోబ‌ర్ 13న “ఆర్ఆర్ఆర్” ప్రేక్షకుల ముందుకు రానుంది. “ఆర్ఆర్ఆర్” చిత్రం విడుదల విషయాన్ని చిత్రయూనిట్‌ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.