జూన్‌ 14 తరువాత ఎంసెట్‌..వెయిటేజ్‌ యథాతథం!

170

తెలంగాణ ఎంసెట్‌పై శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌, సిలబస్‌ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఎంసెట్‌లో ఇంటర్మీడియట్‌‌ మార్కుల వెయిటేజ్‌ యథాతథంగా కొనసాగిస్తామని ఉన్నత విద్యా ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ స్పష్టం చేశారు.

ఈసారి నిర్వహించే ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌, ద్వితీయ సంవత్సరం నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

జూన్‌ 14 తరువాత ఎంసెట్‌ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఎంసెట్‌ సిలబస్‌ విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.