ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు.
రాష్ట్రంలో ఇంటర్నెట్ నెట్ ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇంటర్నెట్ నెట్‌వర్క్ బలంగా లేకపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు.
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలని అన్నారు.
ఇంటర్నెట్ సదుపాయంతో గ్రామాలో వర్క్ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలని సూచించారు.