ఆ అందాలకు ఫిదా అయిన మహేష్ బాబు…!

202
Mahesh Babu calls Sarkaru Vaari Paata shoot in Sharjah a ‘unique experience'

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం “సర్కారు వారి పాట” చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. మహేష్ తాజాగా షార్జాకు సమీపంలో ఉన్న ఎడారికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

“షార్జాకు సమీపంలో ఉన్న మ్లైహాలో ‘సర్కారు వారి పాట’ను చిత్రీకరిస్తుండడం అద్భుతమైన అనుభూతి కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్భుతమైన లొకేషన్లు బాగా నచ్చాయి. ఇక్కడి అతిథ్యం, ప్రేమ గొప్పగా ఉన్నాయి ” అంటూ మహేష్ ఈ పిక్స్ ను ట్వీట్ చేశారు. అద్భుతంగా ఉన్న ఈ ఫోటోలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గురువారం ‘ఐన్ 5దుబాయ్’ అనే బిల్డింగ్‌కు సంబంధించిన ఫొటోను మహేష్ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… దుబాయ్ ప్రకృతి అందాలకు ఫిదా అయిన మహేష్ ఆ పిక్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

“సరిలేరు నీకెవ్వరు” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న చిత్రమిది. “సర్కారు వారి పాట” చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం విడుదల గురించి సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.