శివారు కాలనీలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

179

తెలంగాణ ఎక్సైజ్ , పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ లో పర్యటించారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అయోధ్య నగర్‌లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

పాత పాలమూరులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు.

ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీతో పాటు, శివారు కాలనీలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.