
గోల్ప్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ కారుకు ప్రమాదం జరిగింది. అయితే తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ టైగర్ వుడ్స్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కారులో ఉన్న బెలూన్ ఓపెన్ కావడంతో ఆయన ప్రాణాల నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న క్రీడాభిమానులు షాక్ కు గురయ్యారు. ఆయన ఎలా ఉన్నారనే విషయంపై ఆరా తీశారు.
టైగర్ వుడ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియాలో టైగర్ వుడ్స్ కారులో ప్రయాణిస్తున్నారు.
అకస్మాత్తుగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. అనేకసార్లు పల్టీలు కొడుతూ.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న టైగర్ వుడ్స్ కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.
బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న లాస్ ఏంజెల్స్ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు.
అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది అక్కడకు చేరుకొని ఉడ్స్‌ను కారు నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆయన రెండు కాళ్లకు చికిత్స చేశారు.
శస్త్ర చికిత్స విజయవంతమైందని లాస్ ఎంజెల్స్ కౌంటీ షెరీఫ్ అలెక్స్ విల్లానుయేవా వెల్లడించారు. 2009లో ఫ్లోరిడాలో కూడా టైగర్ వుడ్స్ కారు ప్రమాదానికి గురయ్యాడు.
48 ఏళ్ల టైగర్ ఉడ్స్ గురించి చెప్పాలంటే… ఇప్పటి వరకు పిజిఎలో 82 టైటిళ్లు గెలిచాడు. 15 మేజర్ చాపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. ఇందులో 5 మాస్టర్ టోర్నీలు కూడా ఉన్నాయి.