టీమిండియాలో ఢిల్లీ ఆటగాళ్ళే ఎక్కువ‌

545

టీమిండియాలో హైద‌రాబాద్ నుంచే కాదు ద‌క్షిణ భార‌త దేశం నుంచి ప్రాతినిధ్యం వ‌హించే వాళ్లు త‌గ్గిపోయారు.

దీంతో ఉత్త‌ర భార‌త్ ఆట‌గాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి ఎలాగైన ఐపీఎల్ కప్ సాధించాలని ఢిల్లీ టీమ్‌ మెంటర్ రికీ పాంటింగ్ పట్టుదలతో ఉన్నారు.

ఇండియా – ఇంగ్లాండ‌ఖ టీ20 సిరీస్‌లో ఢిల్లీ జట్టు నుంచే ఆడే వారిపై రికి పాంటింగ్ ఫోకస్ పెట్టారు.

మార్చి 12న ఇంగ్లండ్‌తో టీమ్ ఇండియా తొలి టీ 20 మ్యాచ్ ఆడనుంది, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 3-1తో గెలుచుకున్నట్టుగానే టీ20 సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన ఊవ్విలూరుతోంది.

టీ20 సిరీస్‌ తరువాత ఇరు జ‌ట్లూ వన్డే సిరీస్ ఆడ‌తాయి.

ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్ళు ఐపీఎల్‌లో బిజీ అవుతారు. ఏప్రిల్ 9 నుండి జరిగే ఐపిఎల్ కోసం ప్రతి జట్లు ఇప్పటికే సన్నహాలు ప్రారభించింది.

ఈసారి ఎలాగైన కప్ సాధించాలని ఢిల్లీ టీమ్‌ మెంటర్ రికీ పాంటింగ్ పట్టుదలతో ఉన్నారు.

ఢిల్లీ జ‌ట్టు నుంచి టీమిండియాకు ముగ్గురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఐపీఎల్‌లో రాణిస్తారని రికీ పాంటింగ్ ఆశాభావంతో ఉన్నారు.

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ విజయంలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ ప్రధాన పాత్ర పోషించారు.

ప్రత్యేకత ఏంటంటే ఈ ముగ్గురూ ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన వారే.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ అత్య‌ధికంగా 32 వికెట్లు తీశాడు. ఎడ‌మ చేతి స్పిన్నర్ అక్షర్ పటేల్ తన తొలి సిరీస్‌లో 27 వికెట్లు పడగొట్టాడు.

అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ జ‌ట్టుకు ఇది క‌లిసొచ్చే అంశం.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట కోసం ఎదురు చూస్తున్నాను అని పాంటింగ్ అన్నారు. అక్షర్ పటేల్, అశ్విన్ బౌలింగ్‌లో రాణించగలరని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

రిషబ్ పంత్ కూడా ఎక్కువ పరుగులు చేస్తాడని పాంటింగ్ నమ్మకంగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.

డీసీ 2019లో ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. గ‌తేడాది యుఎఇలో జరిగిన ఐపిఎల్‌లొ ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది.