
భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వదోదరలో చోటుచేసుకోనోయి.
\బాజ్వాలోని ఆమ్రపాలి సొసైటీలో తన నివాసంలో అతడు ఉరేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు
తన భార్య, అత్తింటి వారే తన చావుకు బాధ్యులని పేర్కొంటూ ఆయన రెండు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు.
బాధితుడిని శిశిర్ దర్జీగా గుర్తించారు. శిశిర్ ఇంటికి వెళ్లిన బంధువులు ఎంతసేపటికీ అతను తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు బృందం అక్కడికి చేరుకుని బలవంతంగా తలుపురు తెరవగా శిశిర్ దర్జీ విగతజీవిగా కనిపించారు.
తనను భార్య అత్తింటి వారు వేధింపులకు గురిచేసేవారని రూమ్‌లో ఉంచిన సూసైడ్ నోట్‌లో రాసిఉంది.
ఎల్‌ఎల్‌బీ చదివిన శిశిర్ దర్జీ ఎన్నడూ న్యాయవాద వృత్తిని చేపట్టలేని స్ధానికులు తెలిపారు.
బాధితుడికి ఎనిమిదేండ్ల కిందట మోనిక అనే మహిళతో వివాహమైంది. పదకొండు నెలల కిందట ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
అప్పటి నుంచి ఆమె తిరిగి శిశిర్ ఇంటికి చేరుకోలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.