బస్సు లోయలో పడి ఎనిమిది మంది దుర్మరణం

234
Eight killed as bus plunges into valley

హిమాచల్‌ప్రదేశ్‌ చంబా జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

తీసా సబ్‌ డివిజన్‌ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడి ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. బస్సు చంబాకు వస్తుండగా మార్గమధ్యలోని ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడ్డ వారిని చంబా హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసులు పేర్కొన్నారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.