
తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించేందుకు వైయస్ షర్మిల కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పలు జిల్లాల నుంచి వచ్చే వైఎస్ అభిమానులతో షర్మిల చర్చలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె పార్టీ పేరు, జెండా, అజెండాపై పలు అంశాలు లీక్ అవుతున్నాయి.
తన తండ్రి పేరు కలిసివచ్చేలా పార్టీకి ‘వైఎస్ఆర్ టీపీ’ గా పేరు పెట్టాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వుంటాయని తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆమె ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని ఏదైనా ఓ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్లోని ఓ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న కరీంనగర్ జిల్లా అభిమానులతో సమావేశం కానున్నారు.