వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ఇటీవల గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ కనిపించాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది . ఇక విక్రమ్ ప్రస్తుతం సామికి సీక్వెల్ లో నటిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. విక్రమ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా..దర్శకుడు హరి తనదైన శైలిలో రూపొందించిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సామి 2 ట్రైలర్‌కు యూట్యూబ్‌లో కోటి వ్యూస్ రావడంతోపాటు లక్షా 90 వేల లైక్స్ వచ్చాయి.
విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుండగా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఈ సినిమాతో విక్రమ్ మరోసారి అదరగొడతాడని అంటున్నారు. మరి ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
విక్రమ్ ‘సామి 2’ ట్రైలర్ విడుదల