
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘వై83’ ని తాజాగా విడుదల చేసింది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే విడుదలైన ఈ ఫోన్ రూ.14,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.22 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఉన్న 13 మెగాపిక్సల్ కెమెరాతో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
వివో వై83 ఫీచర్లు…
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0
3260 ఎంఏహెచ్ బ్యాటరీ