రామ్ చరణ్ సినిమా రంగస్థలం 1985 టీజర్

915
ramcharan-movie-rangasthalam-1985-teaser

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘రంగస్థలం 1985’ టీజర్ వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ మార్క్ టాలెంట్‌తో ఈ టీజర్‌ను నింపేశాడు.ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 24న సాయంత్రం 4.15 గంటలకు రంగస్థలం టీజర్‌ను మైత్రీమూవీ మేకర్స్ వారు ట్విట్టర్ ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా సుకుమార్ నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వ్య‌క్తిగా చిట్టిబాబు పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతిబాబు.. ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన‌సూయ ఈ మూవీలో రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ramcharan movie “rangasthalam 1985” teaser

Mega Power Star Ram Charan and creative director Sukumar are in the cinematic movie ‘Rangastalam 1985’. This movie was released among the massive expectations of teaser audience. Mega fans have always wondered when the ‘ Rangastalam 1985’ teaser was filled with Sukumar mark talent without the downfall the expectation of the mega fans.

As stated earlier, on January 24 at 4.15 pm, theatrical teaser was released by Maitri movie Makers who posted this teaser on Twitter. The movie was set in 1985 as a romantic movie with director Sukumar.

Ram Charan is playing the role of Chitti Babu in this movie while Samantha is acting as heroine. Jagapathi Babu is playing one of the lead roles. Anasuya is reported to be seen in this movie. Rock Star Devi Sri Prasad is providing music for this film.

Naveen Erineni, Ravishankar Erineni and Mohan Chekurugi are producing the most prestigious film on Maitri Movie Makers banner.