నాగ శౌర్య ‘ఛలో’ మూవీ టీజర్ మరియు రివ్యూ

946
ira-creations-nagashourya-rashmika-mandanna-chalo-movie-teaser

నాగ శౌర్య, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఛలో’. ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య, క‌ళ్యాణ‌వైభోగమే, జ్యోఅచ్చుతానంద’ లాంటి విభిన్న క‌థాంశాల‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాగ‌శౌర్య ‘ఛలో’ మూవీతో డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈసందర్భంగా ఛలో మూవీ టీజర్‌ను విడుదలైంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదలైన ‘ఛలో’టీజర్ ఫన్‌ని జనరేట్ చేస్తూ.. కథలోనికి తీసుకువెళ్లింది. తిరుప్పురం.. ఆంధ్రా, తమిళనాడు బార్డర్‌లో ఉన్న వూరు. 1953లో తమిళనాడు నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ వూరి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒకవైపు తెలుగు వాళ్లు, మరోవైపు తమిళవాళ్లు. అటు వాళ్లు ఇటు రాకూడదు, ఇటు వాళ్లు అటు పోకూడదు. కంచె కట్టుకుని, కట్టుబాట్లు పెట్టుకుని మరీ కొట్టుకుని చస్తున్నారు’అంటూ టీజర్‌లోనే ‘ఛలో’ చిత్ర కథ ఏంటో చెప్పాడు దర్శకుడు.

ఇక హీరో నాగశౌర్య.. మరీ ఇలా సాంబారు ఇడ్లీ కసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటుంది అంటూ హాస్యపు జల్లులు కురిపిస్తూనే ఆలోచనలో పడేశాడు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు.. హీరోయిన్ రష్మిక మండన్న క్యూట్ లుక్స్‌తో కలర్ ఫుల్‌గా ఉన్న ‘ఛలో’ టీజర్ ప్రేక్షకులతో థియేటర్స్‌కి ‘ఛలో’ అనేట్టు ఉంది.

ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1‌గా చిత్రంగా ‘ఛలో’ మూవీని హీరో నాగ శౌర్య సొంతంగా నిర్మిస్తుండటం విశేషం. ఈమూవీ డిసెంబర్ 29న థియేటర్స్‌లో సందడి చేయనుంది.

చక్కటి వినోదాన్నిపంచే “ఛలో” మూవీ రివ్యూ

నటీనటులు – నాగ శౌర్య, రష్మిక మండన్న, నరేష్, వెన్నెల కిషోర్, సత్య, పోసాని కృష్ణ ముర‌ళీ, వైవా హ‌ర్ష‌, అచ్యుత్ కుమార్, మైమ్ గోపి, ప్ర‌గ‌తి
సంగీతం: మహతి స్వర సాగర్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.. తమ్మిరాజు
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: ఉషా ముల్పూరి
బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌
విడుదల తేదీ: 02-02-2018

ఊహలు గుసగుసలాడే’ ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జ్యో అచ్యుతానంద’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్ర విజ‌యాల‌తో జోరుమీదున్న నాగ‌శౌర్య‌కు ఆ త‌ర్వాత న‌టించిన రెండు చిత్రాలు నిరాశ ప‌రిచాయి.. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని త‌న స్వంత నిర్మాణ సంస్థ ద్వారా రూపొందించిన మూవీ ఛ‌లో. ఈ మూవీ ద్వారా వెంకీ కుడుమ‌ల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. మ‌రి ఈ కొత్త ద‌ర్శ‌కుడు నాగ శౌర్య‌కు హిట్ ఇచ్చాడా లేదా తెలియాలంటే ఈ స‌మీక్ష చ‌ద‌వాల్సిందే….?కథ

హరి(నాగశౌర్య) ఓ పోకిరి.. చిన్న వ‌య‌స్సు నుంచి గొడ‌వ‌లు, కోట్లాట‌లు అంటే చాలా ఇష్టం. కొట్లాల‌న్నా, కొట్టించుకోవాల‌న్నా తెగ స‌ర‌దా. దీంతో విసుగెత్తిన త‌ల్లిదండ్రులు న‌రేష్, ప్ర‌గ‌తిలు హరిని ఆంధ్ర. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తిరుప్పురం అనే ఊరికి పంపిస్తారు. ఆ ఊర్లో తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు రెండు వ‌ర్గాలుగా విడిపోయి గొడవలు పడుతూ ఉంటారు. గొడవలు ఎక్కువగా ఉండే ప్లేస్ కి పంపిస్తే హరి చేంజ్ అవుతాడేమో అనేది నరేష్ ఆశ. తీరా హరి ఆ ఊరికి వెళ్లి చూస్తే తమిళ వర్గం నాయకుడు అయిన వీరముత్తు(మైమ్ గోపి) అలాగే తెలుగు వర్గం నాయకుడు అయిన కేశవా(అచ్యుత్ కుమార్) లకి మధ్య పచ్చగడ్డి వేస్తే బాగ్గుమనేంత పగ ఉంటుంది అని తెలుసుకుంటాడు. అస‌లే కోట్లాట‌లు , కుమ్మ‌లాట‌లతో చీలిపోయిన తెలుగు- త‌మిళ‌వ‌ర్గం ఆ ఊరిలో ఓ కంచెను వేసుకొని ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటుంటారు. అయితే అప్పుడే వ‌చ్చిన హ‌రిని చూసిన కొంత‌మంది త‌మిళులు అత‌న్ని చంపాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తారు. . ఈ క్రమం లో అక్కడ కాలేజీ లో జాయిన్ అయిన హరి కార్తిక (రష్మిక) ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కార్తీక కూడా హరిని లవ్ చేస్తుంది. కాని వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలి అంటే ఆ రెండు ఊర్లు గొడవలు అన్ని మానేసి కలిసి పోవాలి అనే కండిష‌న్ పెడుతుంది. మరి ఆ రెండు ఊర్లని నాగ శౌర్య ఎలా కలిపాడు ? చివరికి హరి తన ప్రేమని దక్కించుకొని కార్తీక ని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది తెలీయాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ

1953లో రెండు వర్గాల వారు ఊరు మధ్యలో కంచె ఏర్పాటు చేసుకొని హద్దులు విధించుకుంటారు. అలా ఊరికి వ‌చ్చిన హీరో ఆ గొడ‌వ‌ల్ని ఎలా ప‌రిష్క‌రిస్తాడ‌నేది సినిమా వృత్తంగా తెర‌కెక్కింది. ఈ క‌ధ‌లో సీరియ‌స్ నెస్ త‌గ్గించి కామెడీ ట్రాక్ మీద ఎక్కువ కాన్స‌న్ ట్రేష‌న్ పెట్టిన‌ట్లుంది. ప్ర‌తీ సిచ్యూవేష‌న్ కు త‌గ్గ‌ట్లు కామెడీ పెట్టించ‌డంతో సినిమా మొత్తం న‌వ్వులు పువ్వులు పూయిస్తుంది. కాలేజ్‌లో హీరో ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రతి సన్నివేశంలో కామెడీ ఉంటుంది. అప్పటివరకూ సరదాగా సాగిపోయిన సినిమా కాస్త సెకండ్ హాఫ్‌లో కాస్త స్లోగా నడుస్తుందనిపిస్తుంది.

ఏదైతేనేం మొత్తానికి ఆడియన్స్‌ను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు వెంకీ కుడుముల‌. తొలి సినిమా అయినా టేకింగ్ లో కొత్త‌ద‌నం చూపాడు.. పాత‌క‌థ‌కు ఫ‌న్ జోడించి అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక నాగ‌శౌర్య ఈ సినిమా కోసం తన శాయశక్తులా కృషి చేశాడు నాగశౌర్య. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. రష్మిక ప్రతి ఎమోషన్‌ను బాగా ఎక్స్ ప్రెస్ చేసింది. నరేష్, అచ్యుత్ కుమార్, రాజేంద్రన్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలతో మెప్పించారు. సత్య, వైవా హర్షల కామెడీ బాగా పండింది. మహతి స్వర సాగర్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు బాగున్నాయి. పాటలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం ఈ మూవీకి హైలెట్. నిర్మాణ విలువలుభారీగా ఉన్నాయి. సీరియ‌స్ క‌థ అయిన్ చాలా ఫ‌న్ గా ఉండ‌టంతో ఇంటిల్ల‌పాది చూడ‌వ‌చ్చు.. స‌రిహద్దు ప్రేమ‌క‌థ యూత్ కూడా న‌చ్చుతుంది.

ira creations nagashourya rashmika mandanna chalo movie teaser

Naga Shaurya, Rashmika Mandanna as hero heroines Venky Kudumala directed a Love and Family Entertainer Movie ‘Chalo’. Nagasaurya, with different story like Dikkulu choodaku Ramayya, Kalyanvibhogame and Jyozhurtananda has a special place in family audiences. This time The film will be released on December 29 the Chalo Movie Teaser was released.

The ‘Chalo’movie trailer was released by the famous dialogue writer Trivikram Srinivas’s which is a fun generated story. Tirupuram is in Andhra, Tamil Nadu Boarder. When division of Andhra from Tamil Nadu took place in 1953, the division line went from the center of the city. From then on to the Tamils and Telugu people had a strict rule that they should not come here and they do not. The fence is the way it is, the bonds are drifting and the burdens are falling off, was clearly said by the director of ‘Chalo’ in the teaser.

Hero Nageshasuriya Sari Babu is like a bad man to kill him. The love scenes between the hero heroines and the heroine cute looks will make audience ‘Chalo’ to the movie Chalo.
The hero of the film ‘Chalo’ is being produced by Hero Naga Shouriya on the production line No. 1 in the Eye Creations banner. The movie will be released in theaters on December 29.