6జీబీ ర్యామ్‌తో మోటో ఎక్స్4 కొత్త వేరియంట్‌ విడుదల

502
new-smartphone-moto-x4-launched


ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో భారత్ ఒకటి. అందుకనే అనేక విదేశీ కంపెనీలు భారత మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి.కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నాయి. వాటి పోటీని తట్టుకోవడానికి ఇప్పటికే మార్కెట్‌లో నిలదొక్కుకున్న కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.చైనాకు చెందిన లెనొవొ సొంతం చేసుకున్న మోటోరోలా కూడా అదే చేస్తోంది. మోటో ఫ్యామిలీలో మరోకొత్త వేరియంట్‌ సార్ట్‌ఫోన్‌ చేరింది.
సోమవారం మోటోరోలా 6జీబీ ర్యామ్‌తో మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 6జీబీ ర్యామ్‌తో మోటోరోలా నుంచి వచ్చిన తొలి ఫోన్ ఇది.అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓఎస్ 8.0 ఓరియోతో పనిచేస్తుంది.

హానర్ 8 ప్రో, ఒప్పో ఎఫ్5తో నేరుగా పోటీపడనున్న ఈ హ్యాండ్‌సెట్ ధరను రూ.24,999గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.ఇక ఆఫ్‌లైన్‌లో మోటో హబ్స్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది. సూపర్ బ్లాక్, స్టెర్లింగ్ బ్లూ రంగుల్లో లభించే ఈ ఫోన్‌ అమ్మకాలు జనవరి 31 రాత్రి 11.59 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి.మోటో ఎక్స్4 ఆవిష్కరణలో భాగంగా ఈ ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్టులో కొన్ని ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 తక్షణ డిస్కౌంట్‌ను పొందొచ్చు.అలాగే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3వేల వ‌ర‌కు డిస్కౌంట్ వ‌స్తుంది. వొడాఫోన్ యూజర్లకు డేటా ఆఫర్ కూడా లభిస్తుంది. రూ.199 రీఛార్జ్‌తో 490జీబీ డాటాను పొందొచ్చు.అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 2(శుక్రవారం)వరకు మాత్రమే లభ్యం.

also read : పోలీస్ ల ముందు లొంగిపోయిన నటి అమల పాల్

మోటో ఎక్స్4 స్పెసిఫికేషన్లు

  • 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్ప్లే (1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్)
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లేయర్ ప్రొటెక్షన్
  • ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
  • 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
  • 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రోఎస్డీతో 2టీబీ వరకు పెంచుకోవచ్చు)
  • 12ఎంపీ ఆటోఫోకస్ పిక్సెల్ సెన్సార్, 8ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో డ్యుయల్ వెనుక కెమెరా సెటప్
  • ఎల్ఈడీ ఫ్లాష్‌తో 16ఎంపీ సెల్ఫీ షూటర్
  • 14 వాట్స్ టర్బోపవర్ సుదపాయంతో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ (15 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల పాటు ఫోన్ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది)
  • 4జీ వివోఎల్టీఈ, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్, వైఫై, జీపీఎస్ తదితర సదుపాయాలు

 

new smartphone moto x4 launched

India is one of the largest smartphone markets in the world. This is why many foreign companies enter the Indian market. Companies that are already on the market are trying to cope with their competitors Lenno, owned by Lenovo is another new variant of smart phone in the Moto family .

Motorola launches a Moto X 4 smartphone with 6 GB of RAM this is the first Motorola phone with 6 GB of RAM. This smartphone works with Android Lite OS 8.0 Oreo.

The Honor 8 Pro, the handset will compete directly with Oppo F5, priced at Rs 24,999. This smartphone can be purchased via Flipkart Online. This phone is also available offline. Super Black and Sterling Blue will debut on the flipkart at 11:59 pm on January 31st. The company offers some offers on the flipkart with the purchase of this phone as part of MOTO X4 innovations. If you purchase this phone through ICICI Bank Credit Card, you will receive an immediate reduction of Rs. 1500. Similarly, you will have a reduction of Rs.3000 by exchangeof your old smart phone. Vodafone users also get data offers of 490 GB data with a recharge of Rs .199. No cost will be provided to EMI. This offer is only available on February 2nd (Friday).

Motorola X Features

• Full HD LED 5.2-inch IPS display (1920 × 1080 pixel resolution)
• Gorilla Corning glass layer protection
• Android 8.0 Oreo
• Qualcomm Snapdragon 630 2.2GHz processor
• 6GB of RAM, 64GB internal storage (up to 2TB with microSD)
• Dual rear camera configuration with 12 MPi autofocus pixel sensor, 8 MP ultra wide angle sensor
• 16 MP Selfie Shooter with LED Flash
• 14-watt turbocharger with 3000 mAh battery (company says phone works for about 6 hours with 15 minutes charge)
• 4GVVTEE, USB Type C, Bluetooth, WiFi, GPS and other facilities