రాజు గారి గ‌ది 3 ట్రైల‌ర్ విడుదల

381
director omkar movie

‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని అందుకున్న ఓంకార్ ప్ర‌స్తుతం అశ్విన్‌బాబు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో రాజుగారి గ‌ది 3 చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. షబీర్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అశ్విన్‌, అవికాగోర్‌ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టారు.ఈ సినిమాట్రైల‌ర్‌ని వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.