ఈ రోజు రాశి ఫలితాలు–ఆదివారం 15 సెప్టెంబర్ 2019

333
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం, వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళ పక్షం, పాడ్యమి: ఉ. 10.27 తదుపరి విదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం: రా. 12.59 తదుపరి రేవతి అమృత ఘడియలు: రా. 7.40 నుంచి 9.26 వరకు, వర్జ్యం: ఉ. 9.04 నుంచి 10.50 వరకు, దుర్ముహూర్తం: సా. 4.23 నుంచి 5.12 వరకు, రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు, సూర్యోదయం: ఉ.5-51; సూర్యాస్తమయం: సా.6.01

మేష రాశి :ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకు రారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరుగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృషభ రాశి :ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీ స్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.

మిథున రాశి :ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

కర్కాటక రాశి :ఈ రోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహ రాశి :ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన వాటికి సంబంధించిన భయాలు ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

కన్య రాశి :ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం విషయంలోగానీ, విద్య విషయంలోగానీ కొంత ఆందోళన చెందుతారు.

తుల రాశి :ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోటానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.

వృశ్చికం రాశి :మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.

ధనుస్సు రాశి :ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, చిరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మకర రాశి :ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభ రాశి :ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలైనప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

మీన రాశి : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.