ఈ రోజు రాశి ఫలితాలు–గురువారం 09 ఏప్రిల్ 2020

484
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేష రాశి Aries: ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా చాకచక్యంతో అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుంచి ధన వస్తు లాభాలు ఉంటాయి.

వృషభ రాశి Taurus: కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

మిథున రాశి Gemini: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. ప్రారంభించిన నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు.

కర్కాటక రాశి Cancer: మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం మాత్రం లభించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన కాంట్రాక్టులు దక్కుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

సింహ రాశి Leo: కుటుంబంలో కీలక విషయాలు చర్చకు వస్తాయి. ప్రారంభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతలు, హోదాలు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కన్య రాశి Virgo: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓ వార్త కుటుంబంలో ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

తుల రాశి Libra: క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సఫలమవుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు, హోదాలు పొందుతారు. చేపట్టిన పనులు చాకచక్యంతో వ్యవహరించి సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి Scorpio: వివాదాలకు దూరంగా ఉండాలి. దూర ప్రాంతాల్లోని బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వస్తు లాభం పొందుతారు. కీలక విషయాలలో కుటుంబంసభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.

ధనుస్సు రాశి Sagittarius: ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి గుర్తింపు తెచ్చుకుంటారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి Capricorn: కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

కుంభ రాశి Aquarius: దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. చేపట్టిన పనులలో కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సోదరులను కలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు.

మీన రాశి Pisces: ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహనయోగం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. వస్తు లాభం పొందుతారు. ఇతరుల ధనసహాయం విషయంలో తొందరపాటు తగదు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.