ఈ రోజు రాశి ఫలితాలు–ఆదివారం 29 మార్చి 2020

561
rashi phalalu
ఈ రోజు రాశి ఫలితాలు

మేష రాశి Aries: ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

వృషభ రాశి Taurus: ఈరోజు కొంతకాలంగా వెంటాడుతున్న స్తబ్ధత తొలగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.

మిథున రాశి Gemini: ఈరోజు బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. విరాళాలు, చందాలకు వెచ్చిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. సినీ, రాజకీయ రంగాల వారికి అర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం.

కర్కాటక రాశి Cancer: ఈరోజు సమావేశాల్లో గౌరవ మర్యాదులు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో లక్ష్యసాధనకు పెద్దల సహకారం లభిస్తుంది.

సింహ రాశి Leo: ఈరోజు వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రకటనలు, కమ్యూనికేషన్లు, ఆడిటింగ్‌ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరం. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దలతో సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు.

కన్య రాశి Virgo: ఈరోజు ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. పోలీస్‌, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. ప్రయాణాలు, సమావేశాలకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు.

తుల రాశి Libra: ఈరోజు బీమా, గ్రాట్యుటీ, పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. భాగస్వామి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం మెరుగవుతుంది. క్రయవిక్రయాలకు అనుకూలం.

వృశ్చిక రాశి Scorpio: ఈరోజు జనసంబంధాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు, వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి.

ధనుస్సు రాశి Sagittarius: ఈరోజు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రకటనలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగవుతుంది.

మకర రాశి Capricorn: ఈరోజు మనసు ఉల్లాసంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్స్‌కు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి Aquarius: ఈరోజు రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.

మీన రాశి Pisces: ఈరోజు బోధన, రవాణా, స్టేషనరి, కమ్యూనికేషన్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. విలువైన పత్రాలు అందుకుంటారు. ప్రయాణాలకు నిధులు సర్దుబాటవుతాయి. సోదరీసోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.