కరొనా కి మందు దొరికింది

785
SMS jaipur doctors

రాజస్థాన్ లోని జైపూర్ నగరం లోని సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్ లో సీనియర్ ప్రొఫెసర్ అఫ్ మెడిసిన్ డాక్టర్ శ్రీ ప్రకాష్ కేశ్వాని గారి డాక్టర్ల బృందం కరొనా కి మెడిసిన్ కనుక్కున్నారు. ఈ మెడిసిన్స్ అన్ని ఇంతకు ముందు వున్నవే. వేరే రోగాలకు వాడే మందులన్నమాట. ఈ మెడిసిన్స్ తో ముగ్గురు కరోనా పాసిటివ్ వ్యక్తులను నెగటివ్ గా మార్చారు.

వారు అనేక ఆర్టికల్స్ చదివి కనుక్కున్నది ఏమిటంటే ఈ వ్యాధికి రెండు రకాల ఆంటీ వైరల్ డ్రగ్స్ పనిచేస్తాయని. అవి ఏమిటంటే

  1. లోపినావిర్ , రిటోనావిర్. ఇవి రెండు హెచ్ ఐ వి ఎయిడ్స్ కి వాడే మందులన్నమాట.
  2. అలాగే మరో మందు క్లోరోక్విన్. ఇది మలేరియా కి వాడే మందు.
  3. ఇంకొక మందు – ఒసెల్టామైవిర్ . ఈ మందు స్వైన్ ఫ్లూ కోసం వాడే మందు.

పై డాక్టర్ల బృందం డా|| బండారి, డా|| అమన్ శర్మ, డా|| అభిషేక్ అగర్వాల్, డా|| ఎస్.బెనర్జీ, డా|| డి.ఎస్.మీనా ఈ మందుల తో ముగ్గురు కరోనా బాధితులను 5 నుండి 8 రోజుల వ్యవధి లో పూర్తిగా నయం చేసారు.

డాక్టర్ శ్రీ ప్రకాష్ కేశ్వాని మాట్లాడుతూ ఇప్పటివరకు కరోనాకి మందు కనుగొనబడలేదు. మేము చదివిన అనేక ఆర్టికల్స్ లో మాత్రం ఒక విషయం వుంది. రెండు ఆంటీ వైరల్ మందులు పనిచేయవచ్చని చదివాం. అవి ఏమిటంటే లోపినావిర్ , రిటోనావిర్. అవి కాక ” క్లోరోక్విన్ ” అనే మరో మందు ఇది మలేరియా కి పనికివచ్చే మందు అన్నమాట. ఈ మెడిసిన్ ని ఉపయోగిస్తే ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్ తొలగించ వచ్చని గుర్తించాం. ఇలా మొత్తం మూడు మెడిసిన్స్ ని వేర్వేరు మోతాదుల్లో రోగికి ఇవ్వటం వల్ల వారు పూర్తిగా కోలుకున్నారు. ఈ మూడు రకాల మందులు హెచ్ ఐ వి ఎయిడ్స్ కి, మలేరియా కి, స్వైన్ ఫ్లూ కోసం వాడే మందులు.

అయితే కరోనాకి సరైన మందు లేదా వాక్సిన్ లేకపోవటం వల్లనే మేము ఇంత ధైర్యం చేయాల్సి వచ్చింది. ఎలాగైనా ప్రజల ప్రాణాలు కాపాడాలని అహర్నిశలు శ్రమించాం. మా శ్రమ ఫలించింది. కనీసం వాక్సిన్ వచ్చే వరకు ఈ మందులతో మేము రోగులని కాపాడగల్గుతాము.

కానీ మేము ఇలాగె చేయండి అని మిగిలిన డాక్టర్లకి చెప్పలేము. మేము కేవలం మా అనుభవాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాము. అల్టిమేట్ గా ICMR మరియు AIMS లోని కరోనా పై ఏర్పడిన కేంద్ర బృందం సూచించిన విధానాలనే పాటించాలి. సంతోషకరమైన విషయం ఏమిటంటే మన మందులను కూడా ట్రై చేయవచ్చని వారు సూచించారు.