కోవిడ్ 19 కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రారంభించిన Corona Crisis Charity ఫండ్ కు దర్శకుడు సంపత్ నంది అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. తన వంతు బాథ్యతగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
సినిమా రంగ ప్రముఖులు కలిసి, చిరంజీవి గారి ఆధ్వర్యంలో ముందుకు వచ్చి, CCC ఫండ్ ను ఏర్పాటు చేసి, సినీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం బాగుందని, అందుకే ఈ విషయంలో తాను చేయగలిగిన మేరకు సహాయం చేస్తున్నానని ఆయన అన్నారు. ఇది ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని, ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సంపత్ నంది కోరారు. తన వంతుగా కరోనా క్రైసిస్ ఛారిటీ కు 5 లక్షల రూపాయల విరాళం గా అందిస్తున్నట్టు దర్శకుడు సంపత్ నంది తెలిపారు.
ప్రస్తుతం సంపత్ నంది గోపీచంద్ హీరోగా సీటీమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్నా కథానాయిక. మూడు వంతులకు పైగా పూర్తయిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆపారు. యు టర్న్ సినిమాను నిర్మించిన చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాత.