స్వీయ నియంత్రణే మన ఆయుధం – ఎమ్మెల్యే కోరుకంటి

478
MLA Korukanti

అనేక దేశాలను వణికిస్తున్న కారోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కారోనా వ్యాప్తి నివారణకు మన ఆయుధం స్వీయ నియంత్రణేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండల ఎంపిడిఓ కార్యాలయంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేగారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

దేశం సంక్షోభ స్థితిని ఎదుర్కొంటోందని, కరోనా వ్యాది విస్తరించి దేశాలన్ని అతలాకుతలం అవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్ అమలు చేసి కారోనా వైరస్ విస్తరించకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు ఆకలి కష్టాలు ఉండవద్దని గొప్ప మనసున్న సిఎం గారు తెల్లకార్డుదారులకు ఒక్కోక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు నిత్యవసరాల కోసం 1500 రూపాయలను అందిస్తున్నరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయిన వలస కూలీలకు అర్ధిక భరోస కల్పిస్తు ఒక్కోక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు 500 నగదు అందిస్తు దేశ ప్రజల హృదాయలల్లో గొప్ప స్థానం సాధించిన మహనీయులు కేసీఆర్ గారని అన్నారు.

palakurthi meeting

ప్రజలంతా కారోనా వైరస్ నివారణ స్వీయ నియంత్రణతో పాటు సమాజీక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రపరుచుకోవాలని, దగ్గు, జ్వరం, జలుబు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలన్నారు. వరిదాన్య కోనుగోలు సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులను సామాజీక దూరం ఉండేలా చూడాలని, ప్రజాప్రతినిధులు కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతుగా కృషి చేయాలన్నారు..