31వ డివిజన్ లో అడ్డాల మిత్ర బృందం అన్నదాన కార్యక్రమం

536
food service

కరోనా వ్యాధి వ్యాపిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ అవుట్ ప్రకటించటం తో నిరుపేదలకు, వృద్దులకు మరియు దినసరి కూలీలకు పనులు దొరకని పక్షంలో ఎవరు కూడా బొజనం కోసం ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశం తో విజయమ్మ ఫౌండేషన్ మరియు అడ్డాల మిత్ర బృందం ఆధ్వర్యంలో 31 వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి గారు ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

31వ డివిజన్ లోని ప్రజలు ప్రతి ఒక్కరు రెండు పూటలా కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశం తో అడ్డాల స్వరూప – రామస్వామి గారి పేరు మీదుగా సుమారు 200 మందికి పోచమ్మ మైదానం, ఎల్ బి నగర్, శివాజీ నగర్, కూరగాయల మార్కెట్ ప్రాంతాలలోని ప్రజలకు బొజనం ఎర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం లో టీ అర్ ఎస్ నాయకులు యం డి. ఫరీద్, రాసూరీ నర్సయ్య, దుర్గం శ్రీనివాస్, చిదురాల్ల మురళి, దబ్బేట సతీష్, చెలికాని సది,పెర్క రవి, చెలికాని రాజు, యం డి అక్తర్ పాషా, మధు తదితరులు పాల్గొన్నారు.