సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో 20 పారామెడికల్‌ సీట్లు

552
siddipet medical college

రాష్ట్ర పారామెడికల్‌ బోర్డు ఆదేశానుసారం 2019-20 విద్యా సంవత్సరానికి మెడికల్‌ కళాశాలలో పారామెడికల్‌ కోర్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ అరసు అన్నారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులను తీసుకుని 30 వ తేదీన విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూప్‌ చదివిన విద్యార్థులు, ఎంపీసీ చదివిన విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో డీఎంఎల్‌టీలో 20 సీట్లు ఉన్నాయని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.