గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

328

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థ‌లు ఒక్కొక్క‌టిగా తెరుచుకుంటున్నాయి. తాజాగా గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

తెలంగాణలో గురుకుల పాఠశాలలు విజయవంతమైన విషయం తెలిసిందే. దీంతో ఆ పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో 2021-22 విద్యాసంవ‌త్సరానికి గాను గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే టీజీ సెట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు.

ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 3వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం నాలుగో తర‌గతి చదు‌వు‌తున్న విద్యా‌ర్థులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని కూడా కల్పించారు.

అప్లై చేసుకున్న విద్యార్థులకు మే 30న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రతిభ చూపిన విద్యార్థులకు సాంఘిక, గిరి‌జన, బీసీ సంక్షేమ, ఇతర గురు‌కులాల్లో అడ్మిషన్లు ఇస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో 18,560 సీట్లు, బీసీ గురుకులాల్లో 20,800 సీట్లు ఉన్నాయి.

గిరిజన గురుకులాల్లో 4,777 సీట్లు, జనరల్ గురుకులాల్లో 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మొత్తం సీట్ల సంఖ్య 46,937. విద్యార్థులు పూర్తి వివరాలకు www.tswreis.in, http://tgcet.cgg.gov.in,

http://mjptbcwreis.telangana.gov.in, http://tgtwgurukulam.telangana.in, http://tresidential.gov.in వెబ్ సైట్లను సందర్శించవచ్చు.

ఇంకా ఏదైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబ‌ర్ 1800 425 45678కు కాల్ చేయ‌వ‌చ్చు.

టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడిగింపు

మ‌రోవైపు టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.

స్కూల్‌ హెడ్‌మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు.

ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, వొకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ప్రభుత్వం సూచించిన తేదీల లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు.

లేట్ ఫీజు లేకుండా విద్యార్థులు 2021 మార్చి 12 లోగా ఫీజు చెల్లించాలి.

విద్యార్థులు చెల్లించిన ఎగ్జామ్ ఫీజును హెడ్‌మాస్టర్స్ 2021 మార్చి 15 లోగా సబ్ ట్రెజరీ ఎస్‌బీఐకి పంపించాలి.

డీఈఓ కార్యాలయాల్లో నామినల్ రోల్స్‌ని 2021 మార్చి 16, 17 తేదీల్లో సమర్పించాల్సి ఉంటుంది.