మహీంద్రాలో ఉద్యోగాల కోత‌

290

ఈ క‌రోనా వైర‌స్ అనేక మందిని రోడ్డుపాలు చేసింది. చ‌దువులేని వారు ఉపాధిని కోల్పోతే.. చ‌దుకువున్న ఉన్న‌త విద్యావంతులు ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు.

క‌రోనా వైర‌స్ తగ్గుముఖం ప‌ట్టింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ భారీ ప‌రిశ్ర‌మ‌లు ఇంకా క‌రోనా వైర‌స్ దెబ్బ నుంచి కోలుకోలేదు.

ఇందుకు దేశీయ ఆటో మేకింగ్ దిగ్గజ సంస్థ మ‌హీంద్ర అండ్ మ‌హీంద్రనే (ఎంఅండ్‌ఎం) ఉదాహ‌ర‌ణ‌. ఉన్న‌త స్థాయి ఉద్యోగ‌ల‌ను తొల‌గించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది.

వందలాది మంది ఎగ్జిక్యూటివ్‌ స్థాయి వ్యక్తులకు మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ షాక్‌ ఇచ్చింది.

ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తులను 300 మందిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీనంతటికీ కరోనావైరస్ మహమ్మారి సంక్షోభమే కారణం.

మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ వీఎస్‌ పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

మహీంద్రా ప్లానింగ్ కమిటీ ఆఫీసర్ ప్రహ్లాద రావు, ఇతర సీనియర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ వార్తలపై ఎంఅండ్‌ఎం అధికారికంగా ఎటువంటి స్టేట్‌మెంటూ ఇవ్వలేదు. వాహనాల విక్రయాలు మందకొడిగా సాగుతుండ‌టంతో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడింది.

పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి ఆటో, వ్యవసాయ విభాగానికి మాత్రమే పరిమితమైన ఈ కోతలు రీసెర్చ్ వ్యాలీకి కూడా పాకే అవ‌కాశ‌ముంది.

మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటి వరకు అమ్మకాలలో 27.52 శాతం క్షీణించింది.

పరిశ్రమల పరిమాణం 13.2 శాతం తగ్గింది. ఫిబ్రవరిలో ప్రయాణీకుల వాహన రిటైల్ అమ్మకాలు 10.6శాతం పెరగ్గా, టూ వీలర్స్ సేల్ 16.08 శాతం తగ్గాయి.