కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు జాగ్రత్త

238

చిన్న పిల్ల‌లు తాగే పాల ద‌గ్గ‌ర నుంచి అన్నీ కల్తీనే. ఏది అస‌లుదో ఏది న‌కిలీదో తెలుసుకోవ‌డం చాలా క‌ష్టంగా మారుతోంది.

కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచేశాయి. దీంతో కొంత మంది క‌ల్తీ పెట్రోల్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ క‌ల్తీ పెట్రోల్ లేదా డీజిల్ వ‌ల్ల వాతావ‌ర‌ణ కాలుష్యం ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల భ‌విష్య‌త త‌రాలు చాలా ఘోరంగా బాధ‌ప‌డ‌తాయి.

అందులో ఈ కల్తీ చేసే వాళ్ల పిల్ల‌లు కూడా ఉండొచ్చు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి.

రోజురోజుకు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90కు చేరింది.

దీంతో కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. హైద‌రాబాద్ రాజేంద్ర నగర్‌లో కల్తీ పెట్రోల్ కలకలం సృష్టిస్తోంది.

పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో పెట్రోల్‌లో నీళ్లను కలిపి విక్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు వాపోతున్నారు.

ఉప్పర్ పల్లిలోని బడే మియా పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు కలుపుతున్నారు. బంకుకు వచ్చే వాహనదారులకు నిర్వాహకులు కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారు.

నీళ్లు కలిపిన పెట్రోల్ పోయ‌డంతో తమ వాహనాలు పాడై పోతున్నాయ‌ని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్ బంకు యజమానికి, వాహనదారులకు మధ్య వాగ్వివాదం జ‌రిగింది.

పెట్రోల్ బంక్ యజమాని దురుసుగా ప్రవర్తించడంతో వాహనదారులు వెంటనే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. పోలీసులు కల్తీ పెట్రోల్‌ను పరిశీలిస్తున్నారు.