గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

429
TGCET Entrance Notification

తెలంగాణలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్‌ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 2021-22 విద్యాసంవ‌త్సరానికి ఐదో‌ త‌ర‌గతి ప్రవే‌శా‌లకోసం నిర్వహించే టీజీ సెట్‌ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లైంది.

ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షకు అర్హులు.నేటి నుంచి ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 3 వరకు అందుబాటులో ఉంటాయి. మే 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా సాంఘిక, గిరి‌జన, బీసీ సంక్షేమ, ఇతర గురు‌కుల విద్యా‌ల‌యాల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.

 

రాష్ట్రవ్యా‌ప్తంగా అన్ని సంక్షేమ శాఖల పరి‌ధిలోని గురుకులాల్లో 46,937 సీట్లు ఉన్నా‌యి.

ఇందులో ఎస్సీ గురుకులాల్లో 18,560 సీట్లు, గిరిజన గురుకులాల్లో 4777 సీట్లు, బీసీ గురుకులాల్లో 20,800 సీట్లు, జనరల్‌ గురుకులాల్లో 2800 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు గురుకులాల వెబ్‌సైట్లు, టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 45678 సంప్రదించవచ్చు.