ఈసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

668
ECET exam shedule Release

తెలంగాణ ఈసెట్‌-2021 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. జులై 1వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 17న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరగనుంది.

జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

బీఈ, బీటెక్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 17న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 22వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 400 కాగా ఇతర అభ్యర్థులకు రూ.800. పూర్తి వివరాల కొరకు అభ్యర్థులు https://ecet.tsche.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.