వేములవాడ జాతరకు కు హెలికాప్ట‌ర్ సేవ‌లు

254
Helicopter services to Vemulawada Fair

తెలంగాణలో ఎంతో ప్రసిద్ది గాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతియేటా శివరాత్రి జాతర వైభవంగా నిర్వహిస్తారు.

ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.

హైదరాబాద్‌ మీదుగా ఎక్కువగా భక్తులు వస్తుంటారు. వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతేడాది మొదటిసారిగా హెలీకాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్‌ మీదుగా వచ్చే భక్తులకు ఈ అవకాశం కల్పించారు. ఎంతో మంది భక్తులు శ్రీ రాజరాజేశ్వర జలాశయం దృశ్యాలను వీక్షిస్తూ వేములవాడ చేరుకున్నారు.

గతేడాది అపూర్వ స్పందన రావడంతో ఈ సారి కూడా నాలుగు రోజులపాటు హెలీకాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

భక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని మంత్రి సూచించారు.

హెలీకాప్టర్‌ సేవల్లో మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి వేములవాడ రావాలంటే ఒక్క ప్రయాణికుడికి రూ. 12,500 చొప్పున తీసుకోనున్నారు.

తిరిగి వేములవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు అంతే చెల్లించాల్సి ఉంటుంది. ట్రిప్పుకు ఆరుగురు ఉంటేనే ప్రయాణించే అవకాశముంటుందని అధికారులు తెలిపారు.