ఆకట్టుకుంటున్న నితిన్ “చెక్”

426
Nithin's Check Movie Trailer

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “చెక్”. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న “చెక్” చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం.

2 నిమిషాల నిడివితో ఉన్న “చెక్” మూవీ ట్రైలర్ లో నితిన్ ను దేశద్రోహిగా ముద్రవేసి, మరణశిక్ష విధించిన ఖైదీగా చూపించారు. జైలులో ఉన్న హీరోకు ఛాంపియన్ లాగా చెస్ ఆటను ఆడే సామర్థ్యం ఉండడంతో, అతను ఖైదీగా ఉన్నప్పటికీ “చెస్” గ్రాండ్‌మాస్టర్ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

క్రిమినల్ లాయర్ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోను నిర్దోషిగా నిరూపించడానికి పోరాడుతుంది. ఇక నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. “చెక్” ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు, ట్రైలర్ లోని డైలాగులు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

ఇక ఇప్పటికే “చెక్” చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్న “చెక్” చిత్రంలో సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణ మురళి, సాయి చంద్, మురళి శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, రోహిత్ తదితరులు నటిస్తున్నారు. ఇక ప్రియా వారియర్ కు తెలుగులో “చెక్” మొదటి చిత్రం కావడం విశేషం. కాగా “చెక్” చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది.