ప్రియాంక గాంధీ కాన్వాయ్ లో ప్రమాదం!

121
Priyanka-Gandhi Congress

 కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకొంది. కాన్వాయ్‌లోని వాహ‌నాలు అదుపుత‌ప్పి ప‌ర‌స్ప‌రం ఢీ కొన్నాయి. ఈ ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ లో జరిగింది. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారని ప్రికాంగ్రెస్ వ‌ర్గాలు వెల్లడించాయి.

గ‌త నెల 26న రైతులు నిర్వ‌హించిన ట్రాక్టర్ ర్యాలీలో మృతి చెందిన‌ నవ్రీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంకా గాంధీ యూపీలోని రాంపుర్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగిందని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీలో ఉత్తర‌ప్రదేశ్‌లోని రాంపూర్‌కి చెందిన నవ్రీత్ సింగ్ (24) ట్రాక్టర్ నడుపుతుండ‌గా అది బోల్తా పడదామతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. పోలీసుల కాల్పుల వ‌ల్లే అతను చ‌నిపోయాడ‌ని కొంద‌రు ఆరోపించారు.