
దేశ ప్రగతిలో రైతుల భాగస్వామ్యం ఎల్లప్పుడు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీలోని చౌరీ చౌరా శతాబ్ధి వేడుకలను ప్రధాని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్ల నుంచి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రైతులను స్వయం సమృద్ధి చేసేదిశగా అడుగులు వేశామని చెప్పారు.
అందువల్లే కరోనా సంక్షోభ వేళ కూడా భారత్ రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు.
పంట పండించేవాళ్లే దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక అని ఆయన కొనియాడారు. చౌరీ చౌరా ఉద్యమంలోనూ రైతులు కీలక పాత్ర పోషించారని అన్నారు.
కరోనా మహమ్మారి వేళ కూడా వ్యవసాయం రంగం వృద్ధి చెందినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
మండీల ద్వారా రైతులు లబ్ధి పొందేందుకు ఈ-నామ్‌కు లింకు చేస్తున్నట్లు మోదీ తెలిపారు.